- టాలీవుడ్లో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
ప్రముఖ నటుడు చలపతిరావు (78) హఠాన్మరణం చెందారు. ఆదివారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. చాలా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి.. ప్రేక్షకుల మదిపై చలపతిరావు చెరగని ముద్ర వేశారు.
- లెక్కలు వెల్లడించిన కాగ్ .. బడ్జెట్లో లెక్కచూపని కార్పోరేషన్ రుణాలు ఎన్నో?
సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలుకు అంటూ.. వివిధ మార్గాల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గోప్యంగానే ఉంచుతోంది. బడ్జెట్లో లెక్కచూపని అప్పులు భారీగా ఉన్నాయంటూ నివేదికల్లో పేర్కొంటున్న కాగ్.. ఆ వివరాలను వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తోంది. అయినా ప్రభుత్వం రుణాల లెక్కలను వెల్లడించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. అటు కార్పొరేషన్ల బ్యాలెన్స్ షీట్లనూ వెల్లడించకపోవడంపై పౌరసమాజ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలు పెంచుకుందాం: జస్టిస్ ఎ.వి. శేషసాయి
తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలు పెంచుకుందాం అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి. శేషసాయి.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా పిలుపునిచ్చారు. మాతృభాష పరిరక్షణలో తల్లులు, గురువులదే కీలక భూమిక అన్నారు. విజయవాడలో రెండు రోజులపాటు జరిగిన తెలుగు రచయితల ఐదో మహాసభల్లో.. తెలుగు భాష పరిరక్షణ కోసం 18 తీర్మానాలు చేశారు.
- ఆర్టీసీ ఛార్జీల మోతలో.. పోటీపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు
ఆర్టీసీ ఛార్జీల పెంపులో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నట్లు అనిపిస్తోంది. దీంతో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. పెరిగిన టికెట్ ధరల వలన ప్రయాణికులపై భారీగా భారం పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఆర్టీసీ ఛార్జీలు తక్కువగానే ఉన్నాయి.
- సాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఏం దోచుకున్నారో చెప్పాలి :మంత్రి బొత్స
ఉత్తరాంధ్రను దోచుకోవడానికి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వచ్చారంటున్న చంద్రబాబు.. వారు ఏం దోచుకున్నారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 'మా శాఖలపై వారేమైనా స్వారీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
- దక్షిణాఫ్రికాలో పేలిన గ్యాస్ ట్యాంకర్.. తొమ్మిది మంది మృతి
దక్షిణ ఆఫ్రికాలోని బోక్స్‌బర్గ్ పట్టణంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంకర్ పేలి తొమ్మిది మంది మరణించారు.
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆ దేశాల నుంచే అధిక ముప్పు : నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ జోసెఫ్ స్టిగ్లిట్జ్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా, రష్యా, చైనాల నుంచి ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ జోసెఫ్ స్టిగ్లిట్జ్ అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణం తగ్గదని దాని కారణంగా నిరుద్యోగిత మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా అనేక దేశాల ఆర్థికవ్యవస్థలను దెబ్బతీసిందని అన్నారు. మరో ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివి..
- అన్న బాట.. తమ్ముడి ఆట.. ఐపీఎల్ ఛాన్స్ కొట్టిన కశ్మీరీ ఆటగాడు..
జమ్ముకశ్మీర్ నుంచి వెలుగులోకి వచ్చే క్రికెటర్లే తక్కువ. అందులోనూ విపరీతమైన పోటీ ఉండే ఐపీఎల్లో చోటు దక్కాలంటే చాలా కష్టం. దేశవాళీ అనుభవం చాలా తక్కువే అయినే ఆ రాష్ట్రానికి చెందిన యువ లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ వివ్రాంత్శర్మను ఫ్రాంఛైజీలు పోటీపడిమరీ సన్‌రైజర్స్ దక్కించుకుంది. రూ. 20 లక్షలతో వేలానికి వచ్చిన అతడిని సన్‌రైజర్స్.. ఏకంగా రూ. 2.6కోట్లు కొనుక్కుంది.
- ఉత్తరాఖండ్‌లో గడ్డకట్టిన జలపాతాలు మంచుతో అమెరికా గజగజ చీకట్లో 15లక్షల ఇళ్లు
అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. చలుగాలులకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఎంతగా అంటే మరిగే నీరు వెంటనే గడ్డకట్టిపోతోందంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, ఉత్తర భారతదేశంలో జలపాతాలు, నీటి వనరులు గడ్డకట్టేస్తున్నాయి.
- Avatar 2 OTT Release : ఓటీటీలోకి అవతార్ 2 అప్పుడే.. స్ట్రీమింగ్ తేది అదే..?
సరికొత్త ప్రపంచంతో ప్రేక్షకులను అలరించింది అవతార్ 2. తాజాగా ఈ సినిమా ఓటీటీపై చర్చ జరుగుతోంది. కాగా, ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో అవతార్ 2 విడుదల కాబోతుందని సమాచారం. విడుదల తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది..