ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

..

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 19, 2022, 10:59 AM IST

  • ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.. నందిగామలో ఎద్దుల బండ లాగుడు పోటీలు
    నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ స్థాయి ఎద్దుల బండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు.. ఈ పోటీలకు నలుదిక్కుల ప్రాంతాల నుంచి వేలాది మంది పోటీలకు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖకు ఆధారాలు ఇవ్వనున్న టీడీపీ నేతలు
    కృష్ణా జిల్లా గుడివాడలో.. గత సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహించిన క్యాసినో వ్యవహారం వివాదాస్పదమైంది.. టీడీపీ నేతల చేసిన ఆరోపణలకు స్పందించిన ఐటీ శాఖ అధికారులు..తగిన ఆధారాలను అందజేయాలని ఆదేశాాలు జారీ చేశారు..తరువాత ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కుమారుడికి హార్ట్ఎ​టాక్​.. శుభలేఖలు పంచడానికి వెళ్లి..
    టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అస్వస్థతకు గురయ్యారు. చంద్రమౌళికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి సంబంధించిన పనులలో భాగంగా చెన్నైలో శుభలేఖలు పంచుతున్న సమయంలో ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన బంధువులు ఆయనను సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అట్టడుగు ప్రజల అభ్యున్నతే న్యాయస్థానాల లక్ష్యం: జస్టిస్‌ చంద్రు
    అట్టడుగు ప్రజల అభ్యున్నతికి అండగా నిలవడమే న్యాయస్థానాల లక్ష్యంగా ఉండాలని మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు అన్నారు. అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల డ్రామా హాలులో ఆదివారం విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్‌ చిన్నపరెడ్డి శతజయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కుక్క పిల్లల పైనుంచి కారును తీసుకెళ్లిన డ్రైవర్ ​ తల్లడిల్లిన తల్లి
    హరియాణాలో ఓ వ్యక్తి మూగజీవాలపై కర్కశంగా వ్యవహరించాడు. ఫరీదాబాద్​ జిల్లా బల్లబ్​గఢ్​​ ప్రాంతంలో రోడ్డుపై ఓ కుక్క తన పిల్లలతో సహా ఉంది. అదే సమయంలో అటుగా ఓ కారు వచ్చింది. వాటిని చూసిన కారు డ్రైవర్ పక్కకు పోనివ్వలేదు. కనికరం లేకుండా వాటిపై నుంచి కారును తీసుకెళ్లాడు. దీంతో వాటిలో ఓ కుక్కపిల్ల మృతి చెందింది. మరి కొన్నింటికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అణువంత దీపం.. కొండంత వెలుగు.. అమెరికా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
    ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన భూతాపం, ఇంధన కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మానవాళి అడుగులేస్తోంది. అమెరికా శాస్త్రవేత్తలు చేసిన కృషితో.. నక్షత్రాలకు వెలుగును ప్రసాదించే న్యూక్లియర్​ ఫ్యూజన్​ చర్య భూమిపై సాధ్యపడింది. అయితే దీన్ని అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చుతో మానవాళికి సంబంధించిన ఎన్నో అవసరాలను తీర్చుకోవచ్చు. అసలు న్యూక్లియర్​ ఫ్యూజన్​ అంటే ఏంటో తెలుసుకుందాం! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ట్విట్టర్​ హెడ్​గా వైదొలగాలా?'.. పోల్​ పెట్టిన మస్క్.. దిగిపోవాలన్న మెజారిటీ యూజర్స్​​
    ట్విట్టర్​లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన నూతన అధినేత ఎలాన్​ మస్క్​.. మైక్రోబ్లాగింగ్​ వెబ్​సైట్​ ద్వారా తన వినియోగదారుల స్పందనను కోరారు. "నేను ట్విట్టర్​ హెడ్​ పదవి నుంచి వైదొలగాలా?" అని పోల్​ పెట్టగా.. నెటిజన్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. 56 శాతం మందికి పైగా వ్యతిరేకించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వారెవ్వా అర్జెంటీనా.. మూడో సారి.. మూడో స్థానం.. మూడో జట్టు.. పాపం ఫ్రాన్స్​!
    ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్​ పోరులో అర్జెంటీనా 4-2 తేడాతో పైచేయి సాధించి విశ్వ విజేతగా అవతరించింది. దీంతో ఆ దేశం ఎన్నో రికార్డులను సాధించింది. ప్రస్తుతం అర్జెంటీనా సంబరాల్లో మునిగితేలుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైట్​ శారీలో కీర్తి బ్లాక్​ చీరలో శ్రద్ధ స్టిల్స్​ అదిరిపోయాయిగా
    అమ్మాయిలు చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అచ్చం ఆకాశం నుంచి దిగొచ్చిన దేవకన్యలా ఉంటారు. మరి ఎప్పుడూ మోడ్రన్​ దుస్తుల్లో ఉండే సెలబ్రిటీలు ఒక్కసారిగా శారీ కట్టుకుంటే ఆ ఊహే మజాగా ఉంటుంది కదూ. ఇంకా అభిమానులకైతే పండగే. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేశ్​ పువ్వుల వర్క్​తో ఉన్న వైట్​ శారీతో మరో భామ శ్రద్ధాదాస్ బ్లాక్​ కలర్ చీరతో భలే ముద్దుచ్చేస్తున్నారు. ఈ ఫొటోలు తమ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ​ఇంకా ఆలస్యం ఎందుకు మీరూ చూసేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అందుకే 'సీతారామం'లో సీత పాత్రకు తెలుగు అమ్మాయిని తీసుకోలేదు: హను రాఘవపూడి
    హను రాఘవపూడి.. మొదటి సినిమా 'అందాల రాక్షసి'తోనే తన అభిరుచి చాటుకున్నాడు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా 'సీతారామం'తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'చెప్పాలని ఉంది' కార్యక్రమానికి వచ్చిన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అవి ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.