ETV Bharat / state

అమరావతి రైలు అటకెక్కింది - ఏపీలో రైల్వే ప్రాజెక్టులు

కేంద్ర బడ్జెట్​లో నిధుల కేటాయింపు చూస్తే...రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా ఏర్పాటుచేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు. రైల్వే బడ్జెట్‌లో రాజధాని అమరావతిని కేంద్రం విస్మరించింది. గతంలో 3 లైన్లు మంజూరు చేసినప్పటికీ.. తాజా బడ్జెట్‌లో వాటి ఊసే ఎత్తలేదు. రెండేళ్ల కిందట అరడజను సర్వేలు సైతం చేసినా ఆయా ప్రతిపాదనలకు బడ్జెట్‌లో ప్రస్తావన కూడా లేకుండా పోయింది.

ap rail projects get insufficient funds in railway budget 2020
రాష్ట్రానికి రాని రైలు
author img

By

Published : Feb 6, 2020, 6:12 AM IST

అమరావతి రైలు అటకెక్కింది

రైల్వే బడ్జెట్​లో విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్​కు మొక్కుబడి నిధులు కేటాయించారు. కానీ జోన్​ ఏర్పాటుకు కావాల్సిన నిధుల మంజూరు బడ్జెట్లో కనిపించలేదు. రాష్ట్రంలో డబ్లింగ్ పనులకు తప్ప కొత్త రైల్వే మార్గాలకు నిధులు కేటాయించలేదు. రాజధాని అమరావతి రైల్వే ప్రాజెక్టుకు కేటాయింపులు దక్కలేదు. కేవలం అంచనాలు మాత్రమే వేశారు. హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో కేటాయింపుల వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్‌కు 170 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. గుంటూరు - బీబీనగర్ మధ్య 248 కిలోమీటర్ల దూరానికి 2వేల 480 కోట్లు, 626 కిలోమీటర్ల అకోలా - దోన్ వయా సికింద్రాబాద్, మహబూబ్ నగర్ మార్గానికి 6వేల 260 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు మాత్రమే వేశారు. డబ్లింగ్ పనులకు సంబంధించి నడికుడి - శ్రీకాళహస్తి మార్గానికి 1198 కోట్లు కేటాయించగా.. 50శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

కేటాయింపులు ఇలా..

గూడూరు - గుంతకల్ మధ్య రెండో లైన్‌కు రూ.294 కోట్లు, కోటిపల్లి - నర్సాపూర్ రూ.550 కోట్లు, గూటి-ధర్మవరం రూ.135 కోట్లు, కాజీపేట - విజయవాడ మధ్య మూడో లైన్ కోసం రూ.404 కోట్లు, విజయవాడ - గూడూరు మధ్య మూడో లైన్ కోసం రూ.664 కోట్లు కేటాయించారు. విజయవాడ – గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నర్సాపూర్ - నిడదవోలు మధ్య విద్యుదీకరణకు రూ.1158 కోట్లు... విజయవాడ, కాజీపేట, రేణిగుంట, వాడీ, గూటిలో బైపాస్ లైన్ల కోసం రూ.222 కోట్లు కేటాయించారు. తిరుపతి రైల్వే స్టేషన్ రెండో ప్రవేశ ద్వారానికి 6కోట్లు, కర్నూల్​లో మిడ్ లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీ కోసం రూ.30 కోట్లు కేటాయించామన్నారు.

పట్టాలెక్కిన గుంటూరు-బీబీనగర్ పనులు

కొత్త రైల్వే లైన్ల కోసం రూ. 2856 కోట్లు బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి. డబ్లింగ్‌, థర్డ్‌లైన్‌, బైపాస్‌ లైన్‌ పనుల కోసం 3836 కోట్లు కేటాయించారు. 3 కీలకమైన డబ్లింగ్‌ పనులకు ఆమోదం లభించింది. 290 కిలోమీటర్ల మేర 2900 కోట్ల ఖర్చుతో ధర్మవరం - పాకాల – కాట్పాడి ఒకటి. 240 కిలోమీటర్ల దూరం, 2400 కోట్ల వ్యయంతో... చిరకాల డిమాండ్‌ అయిన గుంటూరు - బీబీనగర్‌ డబ్లింగ్‌ పనులు కూడా మంజూరయ్యాయి. అకోలా - ధోన్‌ లైన్‌ మరో కీలకమైనది.

డబ్లింగ్ పనులు

విజయనగరం-సంబల్‌పూర్‌ మూడో లైన్ డబ్లింగ్ పనులకు 380 కోట్లు మంజూరయ్యాయి. కొత్తవలస - కోరాపుట్‌ మార్గంలో 189 కి.మీ. డబ్లింగ్ పనులకు 196 కోట్లు, కోరాపుట్‌-సింగాపూర్ డబ్లింగ్ పనులకు 200 కోట్లు, గోపాలపట్నం - విజయనగరం మధ్య ఆటో సిగ్నలింగ్ పనుల కోసం 9 కోట్లు, విశాఖలోని వడ్లపూడి వర్క్‌షాప్‌నకు 28 కోట్లు, డీజిల్ లోకోషెడ్ నవీకరణ పనులకు 11 కోట్లు మంజూరయ్యాయి.

ఇదీ చదవండి : విశాఖ రైల్వే జోన్‌కు నిధులు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.