AP Government Hurry to Move to Visakhapatnam: ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి అంటూ కార్యాలయ భవనాలు, నివాసగృహాల ఎంపికలో కొందరు ఐఏఎస్ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. తాత్కాలిక వసతి పేరుతో.. ఖాళీగా ఉన్న కల్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాలు, ఐటీ సెజ్‌ల భవనాలను సైతం వదలడం లేదు. ఇప్పటికే సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వందల కోట్ల రూపాయల ఖర్చుతో రాజభవనాలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల ఆఫీసులు, నివాసాలకు అనువైన భవనాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
క్యాంపు కార్యాలయానికి దగ్గరలో.. రుషికొండకు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. ఐటీ హిల్స్‌లో ఖాళీగా ఉన్న భవనాలను సైతం ఈ జాబితాలో చేర్చింది. రుషికొండ నుంచి ఎంత దూరంలో ఉన్నాయి, వాటి విస్తీర్ణం, విద్యుత్తు, రహదారి, తాగునీరు, మరుగుదొడ్లు వంటి పలు వివరాలతో కూడిన జాబితాను సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీకి నివేదించింది. వివిధ శాఖల కార్యాలయాలకు 15 లక్షల చదరపు అడుగుల్లో 88 బిల్డింగ్లు, ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇందులో విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో 10 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు, ఖాళీ స్థలం సిద్ధంగా ఉందన్నారు. నివాసాల కోసం అధికారులు గుర్తించిన 1,754 వ్యక్తిగత నివాసగృహాలు, ఫ్లాట్లు అన్నీ జీవీఎంసీ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 1,282, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 424, 15 ఇళ్లు ఉన్నాయి. జోన్ 1, 2, 3 పరిధిలో అంటే.. భీమిలి, మధురవాడ, ఆశీల్‌మెట్టలో వెయ్యి 25 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
రుషికొండకు సమీప ఐటీ హిల్స్‌లో ఖాళీగా ఉన్న కొన్ని బిల్డింగ్‌లను మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలకు వినియోగించుకోవచ్చని అధికారులు ప్రణాళికలో పేర్కొన్నారు. ఇవన్నీ రుషికొండకు 5 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ 15 భవన సముదాయాల్లో 5.89 లక్షల చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. ఐటీ సెజ్ ప్రాంతంలోని హిల్ నెంబర్2లో 5 ప్రైవేటు భవనాలు ఉన్నాయి. నాన్ సెజ్ హిల్2లో 3, హిల్3లో 6, రేశపువానిపాలెంలో ఒకటి ఉన్నట్లు గుర్తించారు.
చినముషిడివాడలో రెండు అంతస్థుల్లో 54 వేల 83 చదరపు అడుగుల్లో నిర్మించిన కల్యాణ మండపం, రామ్‌నగర్‌లో కొత్తగా నిర్మించిన వాణిజ్య సముదాయంలో మూడు దుకాణాలు, ఎంవీపీ కాలనీ కొత్త వాణిజ్య సముదాయంలో 2 వేల 219 చదరపు అడుగుల దుకాణాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించుకోవచ్చని అధికారులు సూచించారు. వెంకోజిపాలెంలో శిథిలావస్థకు చేరిన కల్యాణమండపంలో 2 వేల 621.47 చదరరపు అడుగులను ఉపయోగించుకోవచ్చని నివేదికలో పేర్కొన్నారు. సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ ఉద్యోగ భవనంలో 1, 2, 4, 6 అంతస్థుల్లో మొత్తంగా 32 వేల 540 చదరపు అడుగల స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించుకోవచ్చని సూచించారు.
Construction of Wall Around Rushikonda : నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రుషికొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం..