ETV Bharat / state

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర తీరంలో ఆకాశం మేఘావృతమైంది. ఈ ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
author img

By

Published : Jul 2, 2019, 8:37 AM IST

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. బంగాల్‌, ఒడిశా తీరంపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర తీరంలో ఆకాశం మేఘావృతమైంది. ఇవాళ రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. మరో 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది.

Intro:ap_gnt_81_02_rtc_bus_accident_avb_ap10170

నరసరావుపేట శివారులోని బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ప్రమాధంలో పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలవగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని 108 లో పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో లారీలో నిద్రిస్తున్న డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

Body:నందికొట్కూరు డిపోకి చెందిన ap21z 0644 నెంబర్ గల ఆర్టీసీ బస్సు 35 మంది ప్రయాణీకులతో విజయవాడ వెళ్తుండగా నరసరావుపేట సమీపంలోకి చేరుకునే సమయంలో ఎదురుగా అతి వేగంగా లారీ రావడంతో దాన్ని తప్పించే క్రమంలో రహదారి పక్కనే నిలిపివున్న ap 04 tx 8289 నెంబర్ గల మరో లారీని ఢీ కొందని ఆర్టీసీ డ్రైవర్ పోతుల సుందరయ్య చెబుతున్నారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది.

Conclusion:అయితే బస్సులో ప్రయాణించిన కొందరు ప్రయాణీకులు మాత్రం ప్రమాదానికి కారణం డ్రైవర్ అప్రమత్తంగా బస్సు నడపడమే కారణమని అంటున్నారు. బయలుదేరిన దగ్గరనుంచి అతివేగంగా బస్సు నడిపి దారిలో రెండు ఘాట్ల వద్ద డ్రైవర్ నిద్ర మత్తుతో నడపడంతో బస్సు అదుపు తప్పిందని అన్నారు. దీనితో అందరూ బస్ డ్రైవర్ని అరవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ప్రయాణీకులందరూ హెచ్చరించినా డ్రైవర్ మాత్రం నిద్ర మత్తుతోనే బస్సు నడిపాడని తెలిపారు. అందువాళ్లే ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణమన్నారు.
బైట్: పోతుల సుందరయ్య, ఆర్టీసీ బస్సు డ్రైవర్.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.