విశాఖ జిల్లా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న పిల్లిగెడ్డ వంతెన మీద నుంచి నీరు ప్రవహించకుండా అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని ఏపీ జెన్‌కో పర్యవేక్షక ఇంజినీరు సీహెచ్ రామకోటిలింగేశ్వరరావు అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఏవోబీలో ఉన్న పిల్లిగెడ్డ వంతెన కోతకు గురైంది. ఇందులో భాగంగా ఏపీ జెన్‌కో ఎస్ఈ రామకోటిలింగేశ్వరరావు జెన్‌కో అధికారులతో కలిసి పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. వంతెన తూముల వద్దకు పెద్ద చెట్లు, అడ్డుగా రావడం వల్ల వంతెన మీద నుంచి వర్షపు నీరు ప్రవహించి రక్షణగోడలకు ఇబ్బంది అయిందని అధికారులు ఎస్ఈకి వివరించారు. ముందుగా తూములను శుభ్రం చేయాలని, దీని వల్ల ఎగువ ప్రాంతాలు నుంచి వచ్చే నీరు నేరుగా జలాశయంలోకి చేరుతుందని ఎస్ఈ అధికారులకు సూచించారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుని రాకపోకలు పునరుద్దరించాలని ఎస్ఈ ఆదేశించారు .
ఇదీ చూడండి. మంచితనం, త్యాగానికి ప్రతీక మొహర్రం: గవర్నర్