టిక్‌టాక్ వివాదంలో మరో పోలీసు కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. విశాఖ జిల్లా అనకాపల్లి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే వ్యక్తి ఓ అమ్మాయితో టిక్‌టాక్ సన్నివేశం చేశాడు. అరకులో కానిస్టేబుల్‌గా పనిచేసే సమయంలో అది చేసినట్లుగా తెలిసింది. కాగా ఇప్పుడా వీడియో వైరల్ కావటంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ అట్టాడ బాబూజీ తెలిపారు. ఇటీవల శక్తి టీమ్ కానిస్టేబుళ్లు టిక్‌టాక్ చేయటంతో పోలీసులు చర్యలు తీసుకున్న సంగతి విధితమే.
ఇదీ చదవండి