విశాఖ జిల్లా అనకాపల్లి పురపాలక సంఘాన్ని 1877లో ఏర్పాటు చేశారు. అనంతరం జీవీఎంసీలో 2013 జూలై 30న విలీనం చేశారు. ఇంతవరకు వార్డు కౌన్సిలర్లను ఎన్నుకున్న ఓటర్లు ఇప్పుడు కార్పొరేటర్లను ఎన్నుకోబోతున్నారు. అనకాపల్లి జీవీఎంసీని ఐదు వార్డులుగా విభజించారు. అయిదింటిని మహిళలకే కేటాయించారు. జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు రావు గోపాలరావు కళా క్షేత్రాన్ని పరిశీలించారు. ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:
అనకాపల్లిలో తెదేపా విస్తృత స్థాయి సమావేశం