విశాఖ జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. బుచ్చయ్యపేట మండలం పెదపూడి గ్రామానికి చెందిన గోకివాడ అప్పలనాయుడు తన మనవడి రమణతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తాళ్లపాలెం వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అప్పలనాయుడు మృతి చెందగా.. రమణకు గాయాలయ్యాయి. బాధితుణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కశింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి..