ETV Bharat / state

మంత్రి అవంతి-ద్రోణంరాజు శ్రీనివాస్​ మధ్య వాగ్వాదం

విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్​ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి మాటలకు ద్రోణంరాజు ఘాటుగా స్పందించారు. సభా మర్యాదలను పాటించాలని.. చిన్నా పెద్దా తేడా తెలుసుకోవాలని మంత్రికి సూచించారు.

వాగ్వాదం
author img

By

Published : Sep 30, 2019, 10:40 PM IST

మంత్రి అవంతి, ద్రోణంరాజు మధ్య వాగ్వాదం

విశాఖ నగరంలోని ఏయూ కన్వెన్షన్‌ హాలులో గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి అవంతి శ్రీనివాస్‌, వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు నియమామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌, ద్రోణంరాజు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అవంతి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటూ ఎంపికైన అభ్యర్థులకు సూచించారు. ఓ సందర్భంలో వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజును ఉద్దేశిస్తూ అవంతి చేసిన వ్యాఖ్యలు స్వల్ప వాగ్వాదానికి దారితీశాయి. నగరంలో పెరిగిన ఆయనకు గ్రామాల్లోని సమస్యలు తెలియవని మంత్రి అవంతి అన్నారు.

ఆ తర్వాత మాట్లాడిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ అవంతి వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కూడా గ్రామస్థాయి నుంచే వచ్చామని.. తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ గ్రామ కరణం, సర్పంచ్‌, ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్‌, ఎంపీగా పని చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎంతోమందితో తమకు స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. మంత్రి అవంతి సభా మర్యాదలను పాటించాలని.. చిన్నా పెద్దా తేడా తెలుసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. అనంతరం అవంతి మాట్లాడుతూ తన మాటలను ద్రోణంరాజు అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.

Intro:AP_VJA_46_30_BJP_KANNA_PC_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) గాంధీ జయంతిని పురస్కరించుకొని రాజకీయ పరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విజయవాడలో అన్నారు. రాజకీయపరమైన కార్యక్రమాలలో భాగంగా అక్టోబర్ 4వ తేదీన భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో లో ఇసుక కొరత పై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన ఇసుక కొరత నెలకొని లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ,అప్పులపాలై తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరత పై అక్టోబర్ 7వ తేదీన కార్మికులతో కలిసి భిక్షాటన చేపడతామన్నారు. అక్టోబర్ 11వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించి వాస్తవ పరిస్థితులను వివరిస్తామని...ముంపు ప్రాంత వాసులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపిస్తే గతంలో వైకాపా మౌత్ పీస్ అని ఇప్పుడు వైకాపా ప్రభుత్వం తెదేపా మౌత్ పీస్ అని విమర్శిస్తున్నారన్నారు. మహాత్మా గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో పాదయాత్రలు నిర్వహిస్తామని.... నేటి తరానికి మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలిపే కార్యక్రమాలు చేపడతామన్నారు.
బైట్... కన్నా లక్ష్మీనారాయణ భాజపా రాష్ట్ర అధ్యక్షులు

Body:AP_VJA_46_30_BJP_KANNA_PC_AVB_AP10050

Conclusion:AP_VJA_46_30_BJP_KANNA_PC_AVB_AP10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.