చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ విశాఖలో ఊర్వశి కూడలిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. సుమారు 40 ఏళ్ల నాటి అధ్యాపకులు, వారి వద్ద విద్య అభ్యసించిన విద్యార్థులు... నేడు ఉన్నత స్థానంలో ఉన్నవారంతా సమావేశానికి హాజరయ్యారు. ఒకరినొకరు కలుసుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
1982లో డిప్లొమా చదివిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కళాశాల ఆవరణలో వారంతా మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి కళాశాల గొప్పతనం గురించి వివరించారు. ఈ కళాశాల గొప్ప చరిత్ర కలిగిందని, ఇక్కడ విద్యను అభ్యసించిన వారంతా పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నతమైన హోదాల్లో ఉన్నారన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సంఘం తరపునుంచే కాకుండా తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
తమ కళాశాలలో పూర్వ విద్యార్థుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారని, వారందరూ పూర్వ విద్యార్థుల సంఘంలో భాగస్వామ్యులుగా ఉన్నారని ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
ఇది చూడండి: ఘనంగా కెఎల్యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం