విశాఖ విమానాశ్రయానికి వచ్చే విమానాల్లో నీరు నింపేందుకు, నూతన టెర్మినల్ భవనాల అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ పైపులైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం సుమారు 11 లక్షలు ఖర్చు చేయనున్నారు. విమానాశ్రయంలో నీటి అవసరాల కోసం ఇదివరకే జీవీఎంసీ పైప్ లైను ఉన్నా, నగరానికి అనుబంధంగా ఉంది. ఏదైనా సాంకేతిక కారణాలతో నీరు సరఫరా ఆపేస్తే, విమానాల్లోని, టెర్మినల్‌లోని ప్రయాణికుల మరుగుదొడ్లలలో నీరు లేక ఇబ్బందులు తప్పవు. ఇలా జరగకుండా బోర్ల నుంచే నీరొచ్చేలా మరో కనెక్షన్ ఇస్తున్నారు. ప్రస్తుతం టెండర్ల దశలో ప్రకియ ఉందనీ, త్వరలోనే పనులు మెుదలవుతాయని విమానాశ్రయ డైరెక్టర్ రాజకిషోర్ తెలిపారు.
ఇదీ చదవండి: విశాఖ ‘వ్యాగన్ వర్క్‌షాప్’ రెడీ!