ETV Bharat / state

అధికారం అండగా వివాదాస్పద నిర్ణయాలు - ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విద్యార్థి సంఘాల ప్రజాప్రయోజన వ్యాజ్యం

Allegations on Former AU Vice Chancellor Prasada Reddy: ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రసాదరెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చేపట్టిన నియామకాలు నిబంధనలకు విరుద్దమంటూ.. యూనివర్శిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అలుమ్ని అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ కేసు నేడు కోర్టులో విచారణకు రానుండటంతో.. ఏయూ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Allegations on Former VC PVGD Prasada Reddy

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 7:27 AM IST

Allegations on Former VC PVGD Prasada Reddy: ఆది నుంచి వివాదాస్పద నిర్ణయాలతో వివాదాల్లో నిలచిన ఆంధ్ర వర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి పదవి కాలం ఈ నెల 24న ముగిసింది. ప్రసాదరెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనా, ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదనే విమర్శలు ఉన్నాయి. గత నాలుగేళ్లలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అలుమ్ని అసోసియేషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇది నేడు విచారణకు రానుంది. ప్రసాద రెడ్డి నిర్ణయాలతో సీనియర్ ప్రొఫెసర్లు తమ అవకాశాలు కోల్పోయారని ఆరోపిస్తూ.. వీటికి సంబంధించిన వివరాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సంఘం ప్రతినిధులు పంపారు. ప్రసాదరెడ్డిపై లోకాయుక్త లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా ప్రభుతాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వీసీ ప్రసాదరెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన చేపట్టిన నియామకాలు వివాదాస్పదమయ్యాయి. ప్రైవేటు కళాశాలలో పనిచేసిన జేమ్స్‌ స్టీఫెన్‌కు.. సరైన అర్హత లేకున్నా అంబేడ్కర్‌ అధ్యయన కేంద్రం ఛైర్‌ ప్రొఫెసర్‌గా తాత్కాలిక నియామకం పేరుతో వర్సిటీలో స్థానం కల్పించారని ఆప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కొద్దిరోజులకే ట్రాన్స్‌ డిసిప్లినరీ రీసెర్చ్‌ హబ్‌ డీన్‌గానూ.. ఆయనకు బాధ్యతలు అప్పగించారు. వర్సిటీలో కనీసం రెండేళ్ల ప్రొబేషన్‌ పూర్తి కాకుండానే సీనియర్‌ ఆచార్యులను పక్కనపెట్టి సెప్టెంబరులో.. రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక రిజిస్ట్రార్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ వి.కృష్ణమోహన్‌ 2020 ఆగస్టు 31న విశ్వవిద్యాలయ సేవల నుంచి విరమణ పొందారు. కృష్ణమోహన్‌ రిజిస్ట్రార్‌ పదవిలో కొనసాగించాలని.. వీసీ ప్రసాదరెడ్డి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలకు లేఖలు రాశాడు. విద్యా సంబంధిత కార్యకలాపాల్లో ఆయన అనుభవం వర్సిటీకి అవసరమని చెప్పడం వల్ల అతనికి మూడుసార్లు పదవీకాలం పొడిగించారు. మూడోసారి పొడిగించిన పదవీ కాలం కూడా సెప్టెంబరులో ముగియగా అక్టోబరులో తిరిగి ఓఎస్‌డీగా నియమించారు.

పంతం నెగ్గించుకున్న ఎస్‌కేయూ వీసీ - విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసులు

విద్యాసంస్థలు, పరిశ్రమలకు అనుబంధం ఏర్పరిచేందుకు.. అడ్జంక్ట్‌ ప్రొఫెసర్లను నియమించాలని అప్పట్లో యూజీసీ సూచించింది. దీనిని ఆసరాగా చేసుకొని.. వివిధ విశ్వవిద్యాలయాలతో పాటుగా కళాశాలలకు చెందిన వారిని ఏయూ అనుబంధ ఆచార్యులుగా నియమించారు. ఇందుకు కోసం దరఖాస్తులను ఆహ్వానించలేదు. 2021 నుంచి 2023 వరకు మొత్తం 45 మందిని వివిధ విభాగాల్లో నియమించారు. ముందస్తు అనుమతి లేకుండా.. ఒప్పంద ప్రాతిపదికన ఎలాంటి నియామకాలు చేపట్టరాదని.. 2021లో ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పట్టించుకోకుండా 15 మంది సహాయ ఆచార్యుల నియామకాలు చేపట్టారు. తనకు అత్యంత సన్నిహితుడైన ప్రొఫెసర్‌ రాజేంద్ర కర్మాకర్‌ను ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా ఎంపికచేశారు. గతంలో రాజేంద్ర కాకినాడలోని ఏయూ పీజీ సెంటర్‌లో పనిచేసే సమయంలో.. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళా అధ్యాపకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తీరుపై పలువురు ఉపాధ్యాయులు వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు నిజమని తెలడంతో భవిష్యత్తులో ఆయనకు పరిపాలనాపరమైన ఏ పదవి అప్పగించరాదని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్​లో నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ.. వీటన్నింటినీ పట్టించుకోకుండా 2020-22 సమయానికి ప్రిన్సిపల్‌గా, ఆ తర్వాత ఆనరరీ ప్రొఫెసర్‌గా నియమించారు.

HC On Trees Cutting: ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో చెట్లు కొట్టివేతపై హైకోర్టు ఆగ్రహం..

ఎయిడెడ్‌ డిగ్రీకాలేజిల అధ్యాపకులను విశ్వవిద్యాలయాలకు కేటాయించడంపై అప్పట్లో హైకోర్టు స్టే విధించింది. ప్రసాదరెడ్డి, అప్పటి రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ 113 డిగ్రీ కళాశాలల అధ్యాపకులను వివిధ విభాగాల్లో నియమించారు. ఇదే అంశంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు కాగా.. వారందరిని వెనక్కి పంపాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారిచేశారు. ప్రభుత్వం సైతం ఇచ్చిన పాత ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. 73 కళాశాలల అధ్యాపకులు వెనక్కి వెళ్లగా... 40 కళాశాలలకు చెందిన లెక్చరర్లు ఇప్పటికీ వర్సిటీలో కొనసాగుతున్నారు.

Andhra University: 'విశ్వవిద్యాలయం మాది అనే భావనతో ప్రతి విద్యార్థి ఉండాలి'

ఏయూ పూర్వ వీసీ ప్రసాదరెడ్డి నిర్ణయాలపై ఫిర్యాదుల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.