కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా జనవరి 8న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె గోడ పత్రికను కార్మిక నాయకులు ఆవిష్కరించారు. అట్టడుగు కార్మికునికి కనీస వేతనం 21 వేల రూపాయలుగా నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను విరమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల విలీనం చేయవద్దని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టాన్ని... కార్మికులకులందరికీ అమలు చేయాలనే డిమాండ్లతో సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: