విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలు గళమెత్తుతున్నాయి. విశాఖలో మాట్లాడిన వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. ప్లాంట్ నష్టాల్లో ఉంటే దాన్ని గట్టెక్కించే మార్గాలు అన్వేషించాలే తప్ప.. ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమని ఆక్షేపించారు. ప్రైవేటీకరణ నిలుపుదల కోసం ప్రయత్నిస్తామని.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరిశ్రమ నుంచి నిరసన ర్యాలీ చేపట్టాయి. ప్లాంట్ ఆర్చ్ వద్ద కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం.. వామపక్ష నేతలు ఆయనను కలుస్తున్నారు. అందరం కలిసి ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదమన్నారు.
ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా.. ఉద్యమానికి సిద్ధమవాలని గుంటూరు జిల్లా సీపీఐ కార్యాలయంలో వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు తీర్మానించాయి. ఈ నెల 10న గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాలని నేతలు నిర్ణయించారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. కర్నూలులో కార్మిక, కర్షక భవన్‌లో వామపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి.
ఇదీ చదవండి: