ETV Bharat / state

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో.. ఏఐటీయూసీ విజయం

విశాఖ స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయ కేతనం ఎగురవేసింది. ప్రత్యర్థి సంఘం ఇంటక్‌పై 459 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు.

AITUC
AITUC
author img

By

Published : Apr 24, 2022, 6:01 AM IST

విశాఖ ఉక్కు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయ కేతనం ఎగురవేసింది. 459 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి సంఘం ఇంటక్‌పై విజయం సాధించినట్టు శనివారం రాత్రి అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ జరగ్గా, సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి 10.30 గంటలకు ఫలితాలను వెల్లడించారు.

మొత్తం 10,589 ఓటర్ల(కార్మికులు)కు గాను, 9822 మంది కార్మికులు నేరుగా ఓట్లు వేయగా, మరో 70 మంది పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన కార్మిక సంఘాలు ఏఐటీయూసీ-3555, ఐఎన్‌టీయూసీ(ఇంటక్‌)-3096, సీఐటీయూ(సిటూ)- 2834 ఓట్లు సాధించగా, ఇతర సంఘాలకు కొన్ని ఓట్లు వచ్చాయి. 37 ఓట్లు చెల్లనవిగా అధికారులు గుర్తించారు. ఇది కార్మిక విజయమని, కర్మాగార పరిరక్షణకు, కార్మిక సంక్షేమానికి పాటుపడతామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ ప్రకటించారు. మిత్రపక్షాలైన టీఎన్‌టీయూసీ, వీఎస్‌ఈయూ, జేఎంఎస్, హెచ్‌ఎంఎస్, వీఎస్‌ఎంఎస్, యూజ్‌ సంఘాల నాయకులు, కార్యకర్తలు విజయోత్సవంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Visakha Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమకు లాభాల పంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.