Andhra University MOU with STPI :సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ శనివారం ఆంధ్రా యూనివర్సిటీని సందర్శించారు. ఉదయం ఆయన ఏయూ వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్టీపీఐ నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆంధ్రా యూనివర్శిటీలో ఎస్టీపీఐ ప్రాజెక్ట్ కార్యాలయం త్వరలో ఏర్పాటు కానుంది. అదేవిధంగా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సుమారు ఎకరం స్థలంలో ఎస్టీపీఐ ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మించనుంది. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కేంద్రం నిలుస్తోంది. ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాల మార్పిడి జరిగింది. అనంతరం ఎస్టీపీఐ డీజీ అరవింద్‌కుమార్ మాట్లాడుతూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి యువతకు ఉండాలన్నారు. యువత సామర్థ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇంక్యుబేషన్, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నారు.
ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ యూనివర్శిటీని పరిశ్రమలతో అనుసంధానం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. యూనివర్సిటీలోని వివిధ ప్రాంగణాల్లో టెక్, ఫుడ్, ఫార్మా, మెరైన్ ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియను వివరించారు. ఎస్టీపీఐతో భాగస్వామ్యం ఏయూ ప్రతిష్టను మరింత బలోపేతం చేస్తుందన్నారు. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఏయూ నేడు సాధిస్తున్న ప్రగతిని వివరించారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్ మాట్లాడుతూ రెండు విద్యాసంస్థలకు మేలు జరిగేలా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్టీపీఐ డైరెక్టర్ సీవీడీ రామ్ ప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ బి.సురేష్, ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో రవి ఈశ్వరపు, ఐపీఆర్ చైర్ ప్రొఫెసర్ హనుమంతు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: