విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి గురుకుల పాఠశాలలో కరోనా క్వారంటైన్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి కాలినడకన వచ్చేవారికి, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు అధికారులు ఈ పాఠశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పాఠశాలకు సమీపంలోని ప్రజలు.. క్వారంటైన్ కేంద్రం వల్ల తాము ఇబ్బందులకు గురవుతామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.