ఉపాధి హామీ పథకం పనులను 200 రోజులకు పెంచాలని విశాఖ జిల్లా చీడికాడలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు నిరసనకు దిగారు. పని ప్రదేశంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రభావంతో పక్క గ్రామాలకు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడానికి అవకాశం లేదన్నారు.
ఇప్పటికే చాలా మందికి 100 రోజులు పనిదినాలు చివరి దశకు చేరుకున్నాయనీ.. ప్రభుత్వం స్పందించి 200 రోజులకు పనిదినాలు పెంచాలని డిమాండ్ చేశారు. కూలీలకు మెడికల్ కిట్లు పంపిణీ చేయాలని, రోజుకూలి 300 పెంచాలని కోరారు. కరోనా సమయంలో కూలీలకు 7,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
కాలుష్య నియంత్రణ మండలి కొరడా.. చక్కెర కర్మాగారానికి పవర్ కట్