దేశంలో నిర్వహించిన ఉప ఎన్నికలు, బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు పాడేరు వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని వేడుక నిర్వహించుకున్నారు. ఈ ర్యాలీ ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో కురుసా ఉమామహేశ్వరరావు, భాజపా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు మట్టం శాంతకుమారి, రాష్ట్ర భాజపా కార్యదర్శి పాంగి రాజారావు , అరకు జిల్లా అధ్యక్షులు కురుసా రాజారావు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...