విశాఖ జిల్లా అనంతగిరి మండలం వాలాబు సమీపంలోని సరియా జలపాతంలో విద్యార్థి గల్లంతయ్యాడు. విశాఖ నగరంలోని నాయుడుతోటకు చెందిన సంతోష్ (20) తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు సరియా జలపాతం వద్దకు వెళ్లాడు. స్నానం చేసేందుకు ఆరుగులు అందులోకి దిగగా... సంతోష్ గల్లంతయ్యాడు. స్నేహితులు గాలించినా... ఆచూకీ లభించలేదు. సంతోష్ విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నారు.
ఇదీ చదవండీ... 'చంద్రయాన్-2'కు రాష్ట్రపతి రాక!