గణతంత్ర దినోత్సవ గొప్పతనానికి ప్రతీకగా విశాఖ ఐదవ వార్డు పరిధిలోని స్వతంత్ర నగర్లో వెయ్యి అడుగుల జెండాను ప్రదర్శించారు. ఆర్ఎస్ఏ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, స్ధానికులు ఈ జాతీయ జెండా ప్రదర్శనలో పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖ జిల్లా రోలుగుంట మండలం పూసల పూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 140 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ వేడుక గ్రామంలో ఎంతగానో ఆకట్టుకుంది. గ్రామానికి చెంది.. వృత్తిరీత్యా విశాఖలో స్థిరపడిన వ్యాపారవేత్త ఎం. రాజబాబు జాతీయ జెండాను తయారు చేయించి పాఠశాలకు అందజేశారు. ఈయన ఇప్పటికే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సొంత నిధులను వెచ్చించి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు ఈ భారీ జాతీయ త్రివర్ణ పతాకాన్ని అందజేశారు. దీన్ని మండల వైకాపా పార్టీ అధ్యక్షులు మడ్డు అప్పలనాయుడు లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఇవీ చదవండి: జీవరక్ష పతకాల్లో... కొత్తకోట బాలికకు చోటు