Round Table Meeting : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. విజయవాడలోని దాసరి భవన్లో నిర్వహించిన ఈ సభకు కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నూరు శాతం విక్రయించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయమని.. కార్మికులు విశాఖలో నిరసన దీక్షలు చేపట్టారు. వారు చేపట్టిన ఈ దీక్షలు 700 రోజుకు చేరుకున్న సందర్భంగా ఏప్రిల్ ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విశాఖలో భారీ మానవహారం నిర్వహించాలని పోరాట కమిటీ నిర్ణయించిందని.. కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. గత ఇరవై ఆరు నెలలుగా జరుగుతున్న పోరాటం.. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా అడుగు వేయకుండా కేంద్రాన్ని అడ్డుకోగలిగిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బలహీనపరిచాయని ఆరోపించారు. ఇలా బలహీన పరచటమే కాకుండా పోస్కో, అదానీలకు కట్టబెట్టాలని తీవ్ర కుట్రలను చేస్తున్నాయని విమర్శించారు.విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం.. ఏప్రిల్ 1 వ తేదీన రాస్తారోకోలు, మానవహారాల ద్వారా తమ నిరసన తెలియజేయానున్నట్లు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని పార్లమెంటు సమావేశాలలో సంబంధిత కేంద్ర మంత్రులు చెప్తుంటే.. 23 పార్లమెంటు సభ్యులు నోరు విప్పటం లేదని అన్నారు. అలా ఎలా ప్రైవేటీకరిస్తారని ప్రశ్నించటం లేదన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఎందుకు అనటం లేదని ప్రశ్నించారు. ఒక్కరోజు కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై రాష్ట్ర పార్లమెంటు సభ్యులు నిలదీయాలేదని విమర్శించారు. కనీసం ప్రశ్నించి పాపన కూడా పోలేదని వాపోయారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వ్యతిరేకంగా లేదని ఆరోపించారు. అందువల్ల వీటన్నీంటిని పరిగణలోకి తీసుకుని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాటకలను అరికట్టేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సంఘీభావం తెలిపినట్లు వివరించారు.
విశాఖలో రెండు శిబిరాలలో దీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ దీక్ష శిబిరాల ద్వారా సాగుతున్న పోరాటానికి సంఘీభావంగా ఏప్రిల్ 1వ తేదీన విశాఖలోనే మానవహారం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు, కార్మిక వర్గాలు, రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో గొంతు కలపాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కోరుతోందని అన్నారు.
ఇవీ చదవండి :