విశాఖ రైల్వేస్టేషన్‌కు జాతీయ ఉత్తమ పర్యాటక స్నేహపూర్వక అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా 200 పర్యాటక రైల్వేస్టేషన్లు ఉండగా విశాఖకు ఈ అరుదైన గౌరవం దక్కిందని వాల్తేరు డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్ ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ఫీ జోన్ వద్ద ఆయన ఈ అవార్డును చూపించారు. రైల్వేస్టేషన్లో ఉన్న వసతులు, సౌకర్యాల కారణంగా ఈ అవార్డు లభించిందని అయన తెలిపారు.
ఇదీచదవండి