ETV Bharat / state

ఇంటి కల తీరకుండానే.. తిరిగిరాని లోకాలకు..! - person died with electric shock news

సొంతిల్లు నిర్మించుకోవాలనే కోరిక తీరకుండానే ఆ వ్యక్తి అనంతలోకాలకు వెళ్లాడు. ఎన్ని కలలు కన్నాడో ఇంటిని అందంగా తీర్చిదిద్దాలని. కానీ.. ఆశ తీరకుండానే ప్రాణం విడిచాడు. అతని మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో ఈ ఘటన జరిగింది.

person died
విద్యుత్​ షాక్​తో వ్యక్తి మృతి
author img

By

Published : Dec 26, 2020, 6:41 PM IST

ఎలమంచిలిలోని జలాల వీధిలో విద్యుత్ షాక్​ తగిలి ఆడారి గోదారి నాయుడు అనే వ్యక్తి మరణించాడు. పట్టణంలో అతను ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇంటి పనుల్లో ఉండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా అయ్యింది. ఈ ఘటనలో నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరణించిన వ్యక్తి స్వస్థలం రాంబిల్లి మండలం నారాయణపురం కాగా.. ఎలమంచిలిలో ఇల్లు కట్టుకుని స్థిరపడాలని చాలాకాలంగా ఆకాంక్షించాడు. మృతి విషయం తెలిసి.. అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసినట్టు ఎస్సై నర్సింగరావు తెలిపారు.

ఇదీ చదవండి:

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.