ETV Bharat / state

పెళ్లైన మూడు నెలలకే యువకుడి ఆత్మహత్య - విశాఖలో యువకుడు ఆత్మహత్య

విశాఖ జిల్లా అప్పన్నపాలెం గ్రామంలో విషాదం జరిగింది. పెళ్లైన మూడు నెలలకే హరీష్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరీష్ మృతితో అతని భార్య, తల్లి రోదనలు మిన్నంటాయి.

a married youngster made suicide attempt in vishakapatnam
పెళ్లైన మూడు నెలలకే ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు
author img

By

Published : Aug 13, 2020, 4:08 PM IST

విశాఖ జిల్లా పెందుర్తిలోని అప్పన్నపాలెం గ్రామంలో పెళ్లయిన మూడు నెలలకే హరీష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న హరీష్ మే నెలలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. ఆషాఢమాసంలో అతని భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకురావటానికి హరీష్ తల్లి అప్పయ్యమ్మ శ్రీకాకుళం వెళ్లింది. ఇంట్లో ఎవ్వరు లేకపోవటంతో హరీష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పెళ్లైన మూడు నెలలకే భర్త చనిపోవడంతో భార్య తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు లేని ఆమె బంధువులు సంరక్షణలో పెరిగింది. ఇప్పుడు భర్త కూడా దూరమైపోవడంతో ఆమె రోదిస్తున్న తీరు అందిరిని కంటతడి పెట్టిస్తోంది.అసలు హరీష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియటంలేదని కుటుంబసభ్యులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

సమస్యకు పరిష్కారం వెతుక్కున్నారు.. సొంతంగా రోడ్డు నిర్మించారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.