విశాఖ దుర్ఘటన ఎంతో మందికి శోకాన్ని మిగిలిస్తే.... ఆ వ్యక్తికి మాత్రం దుర్బుద్ధి పుట్టించింది. ఎల్జీ పాలిమర్స్‌కు పరిసరాల్లోని ఓ గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి గ్యాస్ లీకేజీ ఘటన తర్వాత తన ఇంట్లో రూ.20 లక్షలు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా... అది వాస్తవం కాదని తేలింది. పోలీసులు అతన్ని ప్రశ్నించగా... భారీ పరిహారం వస్తుందని తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ విషయాలను విశాఖ క్రైమ్ ఏసీపీ పెంటారావు వెల్లడించారు. ప్రజలు భయపడవద్దని.. నిరంతరం పోలీసు పర్యవేక్షణ ఉంటుందని పెంటారావు తెలిపారు.
ఈ విషయంపై మంత్రి కన్నబాబు సైతం స్పందించారు. పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాల్లో పోలీసులు నిఘా ఉందని... ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి