విశాఖ జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట చెరువులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని రావికమతం మండలం జమీందారీ కొత్తపట్నం గ్రామానికి చెందిన సింగంపల్లి రమణ.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 7న బుచ్చింపేటలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అదే రోజు రాత్రి బహిర్భూమికి కోసం వెళ్లిన రమణ... తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ మరుసటి రోజు కూడా రమణ ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అదే గ్రామానికి చెందిన మాదాల చెరువులో రమణ మృతదేహం గమనించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఉంటాడని గ్రామస్థులు, పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రోలుగుంట ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఇదీ చూడండి: