విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం ఛిద్రమైపోవడం వల్ల మృతుడు ఎవరనేది గుర్తుపట్టలేకపోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు మృతదేహాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతుని వివారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రులు రోడ్డుపై సంచరించే మతిస్థిమితం లేని వ్యక్తి కావొచ్చని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: