విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలోని కూడ్రమ్ గ్రామంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన యాదగిరి రాము వ్యవసాయ కూలిగా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. అయితే వచ్చిన డబ్బును మద్యానికి ఖర్చు చేసేవాడు. దీంతో భార్య వెంకటలక్ష్మి... తాగుడు మానమని వేడుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఫలితంగా మనస్తాపం చెందిన రాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై రామకృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: