విశాఖ జిల్లా నర్సీపట్నం అభి సెంటర్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఓ యువతి మౌనదీక్ష చేపట్టింది. 8 ఏళ్లుగా తనను ప్రేమించి.. శారీరక అవసరాలు తీర్చుకుని పెళ్లికి మొహం చాటేశాడని 23 ఏళ్ల యువతి ధర్నా చేసింది. జిల్లాలోని నాతవరం మండలం డి.ఎర్రవరం గ్రామానికి చెందిన మల్లికార్జున రావు ..అదే గ్రామానికి చెందిన తన సమీప బంధువైన 23 ఏళ్ల యువతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరక అవసరాలు తీర్చేసుకొని ముఖం చాటేశాడని...దీనిపై గతంలో ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని బాధితురాలు వాపోయింది. శక్తి టీం, గ్రామ పెద్దలు నిర్ణయించిన ప్రకారం న్యాయం జరగలేదని యువతి తల్లి ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇదీచూడండి.పత్తి వ్యాపారిపై దాడి... వైకాపా అనుచరులపై ఫిర్యాదు