విశాఖ సీపీఎం కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగుల ఫెడరేషన్ల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖపట్నంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గూ నాయుడు అన్నారు. కార్మిక వర్గాల త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా కుదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నవంబర్ 26న సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు తెలిపారు. విస్తృతంగా నగరంలో ప్రచారం నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ఇవీ చదవండి