విశాఖ జిల్లా రావికమతం మండలం చిన్న పాచిలి పంచాయతీ శివారు మత్స్యపురం ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు తదితర విలువైన సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు పది లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే రావికమతం అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు.
ఇదీ చదవండి: