గత మూడేళ్లలో రూ.40.16 లక్షల విలువ గల నాటుసారా పట్టుబడిందని విశాఖ జిల్లా సెబీ(ఎస్ఈబి) రూరల్ అదనపు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తెలిపారు. అనకాపల్లి సబ్ డివిజన్లోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో మరియు పాడేరు సబ్ డివిజన్ల్లోని 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 18,554 లీటర్ల నాటుసారా పట్టుబడిందని తెలిపారు. మాడుగుల శివారు ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో సెబ్ రూరల్ అదనపు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, విశాఖ డీటీసీ డిఎస్పీ ప్రవీణ్ కుమార్, అనకాపల్లి డీఎస్పీ శ్రావణి సమక్షంలో పోలీసులు ఈ నాటుసారాను ధ్వంసం చేశారు. 2,715 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది చదవండి :
RUIA CASE: భార్యపై అనుమానంతో హత్య.. కరోనా మృతిగా చిత్రీకరణకు యత్నం