కారులో 164 కిలోల గంజాయిని తరలిస్తున్నా ముగ్గురిని విశాఖ జిల్లా, పెందుర్తిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కృష్ణరాయపురం వద్ద సోదాల్లో భాగంగా తమిళనాడుకు చెందిన కారును తనిఖీ చేయగా, ఈ గంజాయి పట్టుబడిందని పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితుల్లో ఒకరు పరారవ్వగా, ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. పెందుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. నిందితుల నుంచి19 వేల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వారు వివరించారు.
ఇదీ చదవండి: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలు సీజ్