విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు లారీలలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన 1200 కిలోల గంజాయి విలువ సుమారు కోటి రూపాయలకు పైగా ఉంటుందని కృష్ణదేవిపేట ఎస్ఐ సిహెచ్ భీమరాజు తెలిపారు. విశాఖ మన్యం నుంచి బయలుదేరిన ఈ వాహనాలను ముందస్తు సమాచారం మేరకు మాటు వేసి పట్టుకున్నామని పోలీసులు వివరించారు. గంజాయి తరలించడానికి ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు