విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి 101 మంది పిల్లలను గుర్తించినట్లు విశాఖ సీపీ పేర్కొన్నారు. వారిలో కొంతమంది పిల్లల తల్లిదండ్రులు యాచకులుగా ఉన్నారని.. కొందరు తమతో పాటు పిల్లల్ని వెంట తీసుకువెళ్లినట్లు తెలిపారు. మరికొందరు బాల కార్మికులుగా ఉన్నట్లు గుర్తించామని ఆయన వివరించారు.
పిల్లలకు అన్ని సదుపాయాలు..
అనంతరం బాధితులందరినీ పాపా హోమ్‌కు తీసుకువెళ్లారు. చైల్డ్ లైన్, సీడ్స్, స్వాంతన సేవా సమితి వంటి సంస్థల ఆధ్వర్యంలో పిల్లలకు అన్ని సదుపాయాలు కల్పించారు.
సురక్షితంగా అప్పగింత..
అనంతరం చైల్డ్ లైన్ ప్రతినిధులు, సీపీ మనీష్ కుమార్ సిన్హా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారందరినీ సురక్షితంగా అప్పగించారు. మరోవైపు రూరల్ ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలోనూ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించారు.
ఇవీ చూడండి : '41 (ఏ)నోటీసు ఇవ్వకపోవటం కోర్టు ధిక్కరణ అవుతుంది'