ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వాల్మీకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెదేపా ఎమ్మెల్సీ బీటీ.నాయుడు కోరారు. ఎలాంటి కుల వృత్తి లేని వాల్మీకులకు జగనన్న 'చేదోడు పథకం' వర్తించడం లేదన్నారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందించి వాల్మీకులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని నియెజకవర్గంలో పోలీసులు.... వాల్మీకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
'వాల్మీకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి'
ఎటువంటి కుల వృత్తి లేని వాల్మీకులకు జగనన్న'చేదోడు పథకం' వర్తించడం లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటీ.నాయుడు అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి వాల్మీకులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేయాలని కోరారు.