వైకాపా తీర్థం పుచ్చుకున్న నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్.... ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నేతలు వెల్లడించారు. టెండరింగ్ ప్రక్రియలో పారదర్శకతకు పెద్ద పీట వేసేలా జ్యుడీషియల్ ప్రివ్యూ లాంటి వ్యవస్థలు ఏర్పాటు, రైతు భరోసా లాంటి పథకాలు ఆకర్షించాయని ఆకుల సత్యనారాయణ తెలిపారు. మేనిఫెస్టోను వైకాపా తొలిరోజు నుంచే అమలు చేస్తోందని..., అందుకే జనసేనకు రాజీనామా చేసి వైకాపాలో చేరినట్లు చెప్పారు. నూతన రాష్ట్రానికి మంచి పాలన కావాలని 50 శాతం మంది ప్రజలు జగన్‌కు ఓటు వేశారని జూపూడి అన్నారు. తానూ మంచి పాలన కోసం ఎదురు చూశానని... దళితులకు కీలక పదవులు ఇవ్వటం ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమని చెప్పారు. ఎలాంటి డిమాండు లేకుండా పార్టీలో చేరినట్లు వివరించారు. తెదేపాకు తన రాజీనామాను రిజిస్టర్ పోస్టులో పంపినట్లు చెప్పారు.ఇదీ చదవండి : "మాపై అసత్య ప్రచారానికి..లోకేశ్ ఉద్యోగులను నియమించారు"