ETV Bharat / state

పరిశ్రమలకు నీరు.. ఏపీఐఐసీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం - Nellore district latest news

పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ఏపీఐఐసీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ సంస్థకు అనుసంధానంగా ప్రత్యేక పర్యవేక్షణ సంస్థ ఏర్పాటు కానుండగా-కండలేరు జలాశయం నుంచి మొత్తంగా పది శాతం నీటిని పరిశ్రమల అవసరాలకు వినియోగించనున్నారు. ఇందుకు సంబంధించిన పైప్‌లైన్‌ పనులు జరుగుతున్నాయి.

నీటి సకఫరాకు ఏపీఐఐసీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం

author img

By

Published : May 30, 2021, 8:52 PM IST

నెల్లూరు జిల్లాలో 2010-19 మధ్య 64వేల ఎకరాలను ప్రభుత్వం పారిశ్రామికవాడలు, సెజ్‌లకు కేటాయించగా.. వాటిలో సుమారు రూ.57వేల కోట్ల పెట్టుబడులతో 60 వరకు భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మేనకూరు, మాంబట్టు, కృష్ణపట్న, అంకులపాటూరు, శ్రీసిటీ తదితర ప్రాంతాల్లో కర్మాగారాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు కొంతవరకు మెరుగుపడినా.. కార్యకలాపాలు, ఉత్పత్తులకు అవసరమైన నీటివసతి, లభ్యతే తగినంత లేకుండాపోయింది. ఆయా యాజమాన్యాలకు నేటికీ నీటి వనరే ప్రధాన సమస్య. 2019లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో నీటి ఎద్దడి కారణంగా కొన్ని పరిశ్రమలు తాత్కాలికంగా మూసివేయాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. పారిశ్రామిక అవసరాలకంటూ ప్రత్యేకంగా నీటి కేటాయింపు లేకపోవడం సమస్యను జఠిలం చేస్తోంది.

మేనకూరు పారిశ్రామికవాడలో 15 వరకు భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా- అత్యధికం ప్రైవేటు వ్యక్తుల ద్వారా ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. మాంబట్టు పారిశ్రామికవాడలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారంతో పాటు నీటి వనరులు సమకూర్చడమే లక్ష్యంగా ఏపీఐఐసీ నడుం కట్టింది. వీసీఐసీ, బీసీఐసీ కారిడార్ల పరిధిలోని పారిశ్రామికవాడలు, ఎస్‌ఈజెడ్‌లు, కృష్ణపట్నం ప్రాంతంలో ఏర్పాటు కానున్న సీఈజెడ్‌లోని పరిశ్రమలకు కండలేరు జలాశయం నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రూ.625 కోట్లతో భారీ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఈ పనుల పర్యవేక్షణకు మేనకూరు కేంద్రంగా ఏపీఐఐసీ సబ్‌ జోనల్‌ అధికారిని నియమించింది.

లీటరుకు రూ. 1.50 సెస్సు

పరిశ్రమలకు అవసరమైన నీటి వనరుల కల్పనకు ప్రభుత్వం ఏడీబీ లాంటి సంస్థల నుంచి రుణం తీసుకుంటోంది. అదే సమయంలో నీటి సరఫరా నిర్వహణ, పరిశ్రమల నుంచి సెస్‌ సక్రమ వసూళ్ల పర్యవేక్షణకు ఏపీఐఐసీ ద్వారా ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే లీటరు నీటికి రూ. 1.50 చొప్పున సెస్‌ వసూలు చేయనున్నారు.

ఇకపై పర్యవేక్షణ

కండలేరు నుంచి పారిశ్రామికవాడలకు నీటిని సరఫరా చేసేందుకు పైప్‌లైన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొవిడ్‌ కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయి. పూర్తయితే.. నీటి సరఫరా జరిగే అవకాశం ఉంది. ఈ మొత్తం పర్యవేక్షణకు త్వరలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేస్తోంది. - చంద్రశేఖరయ్య, డిప్యూటీ జడ్‌ఎం, మేనకూరు

4.55 టీఎంసీల సరఫరాకు ప్రణాళిక

నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలోని పరిశ్రమలకు 4.55 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ఏపీఐఐసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎస్‌ఈజెడ్‌ పరిధిలోని 26,830 ఎకరాలకు 1.91టీఎంసీలు, వీసీఐసీ పరిధిలోని నాయుడుపేట పారిశ్రామికవాడలో 4,600 ఎకరాలకు 0.28, పూడి-శ్రీకాళహస్తి పరిధిలోని పారిశ్రామికవాడలోని 25వేల ఎకరాలకు 1.79, మాంబట్టు సెజ్‌కు 0.07, చిన్నపాండూరు సెజ్‌కు 0.07, శ్రీసిటీ పరిధిలోని 6,100 ఎకరాలకు 0.4 టీఎంసీల చొప్పున నీటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 204 కి.మీ. దూరం పైప్‌లైన్‌ వేయాలని నిర్ణయించారు. ఇవి కాకుండా.. మేనకూరులోని పరిశ్రమల నిమిత్తం రూ.74కోట్ల ఏడీబీ నిధులతో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మిస్తున్నారు. ఇలా పారిశ్రామిక పార్కుల్లో ప్రత్యేకంగా నిర్మించిన నీటి వనరులకు కండలేరు నుంచి పది శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు విడుదల చేయనున్నారు.

ఇదీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.