Registration number for government vehicles with AP 40G: ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నెంబరు సిరీస్ రానుంది. ఈ మేరకు రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వ వాహనాలకు `ఏపీ 40 జి’ అనే కొత్త రిజిస్ట్రేషన్ నెంబరు ఉంటుంది. అందుకు తగ్గట్లుగా మోటారు వాహనాల చట్ట సవరణ చేసేందుకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలను 15 రోజుల్లోగా తెలియచేయాలని పేర్కొంటూ రవాణాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు తరహాలో ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్ తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది.
ప్రభుత్వ నూతన వాహనాలకు కొత్త సిరీస్.. ప్రభుత్వం నూతనంగా కొనుగోలు చేసే వాహనాలకు కొత్త సిరీస్ కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వ వాహనాలకు `ఏపీ 40G’ నెంబరు సిరీస్ ను కేటాయించాలని నిర్ణయించారు. ఈమేరకు రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. వివిధ శాఖల అవసరాల రీత్యా ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ నెంబరు సిరీస్`AP 40G’ కేటాయించనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కోంది. ప్రభుత్వ వాహనాలకు `ఏపీ 40G’ సిరీస్ జారీపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలూ కోరుతూ రవాణాశాఖ ఈ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ పోలీసు వాహనాలకు మాత్రమే ప్రత్యేకంగా పి అక్షరంతో కూడిన సిరీస్ ను కేటాయిస్తున్నారు. ఇక నుంచి ప్రభుత్వ వాహనాలకు కూడా వేరు చేసేలా జి అక్షరంతో కూడిన 40 రిజిస్ట్రేషన్ సిరీస్ ను కేటాయించాలని ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ ను ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.
ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా.. తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా... ప్రభుత్వ వాహనాలను ఈజీగా గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగనున్నాయి. పోలీస్ వాహనాలకు ఏపీ 18, ఏపీ 39 రిజిస్ట్రేషన్ సిరీస్ తో కొనసాగుతుండగా.. ప్రభుత్వం అద్దెకు తీసుకుంటున్నవాహనాలకు ఈ నిబంధన వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది.
వన్ స్టేట్ వన్ సిరీస్ విధానానికి స్వస్తి..: వాహన రిజిస్ట్రేషన్లు ఆన్ లైన్ కావటం, ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా వన్ స్టేట్ వన్ సిరీస్ విధానంతో 2018 చివరి నాటి నుంచి 39 సిరీస్ రిజిస్ట్రేషన్ నెంబర్లు జారీ అవుతున్నాయి. అప్పటి వరకూ జిల్లాల వారీగా జారీ చేసిన వివిధ సిరీస్ లను రద్దు చేశారు. వాటి స్థానంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు 39 సిరీస్ మాత్రమే జారీ చేస్తున్నారు. ఏపీలో ప్రత్యేకంగా కనిపించాలన్న ఉద్దేశ్యంతో ఇక నుంచి ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40 జి అనే కొత్త రిజిస్ట్రేషన్ నెంబరు తీసుకువచ్చారు.
ఇవీ చదవండి