Sarpanch Protest on Govt policies: అధికార వైకాపాకు చెందిన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పులివల్లం సర్పంచ్ బాలకృష్ణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుతూ మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. సీఎం జగన్‌పై ఉన్న అభిమానంతో లక్షలు ఖర్చు చేసి సర్పంచ్‌గా గెలిచినా..ప్రజలకు కనీసం తాగునీటి వసతి కల్పించలేకపోతున్నామని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు.
తాగునీటి పథకం విద్యుత్ మోటార్ కోసం ముప్పై వేల రూపాయలు కేటాయించాలని మూడు నెలలుగా వేడుకుంటున్నా పట్టించుకోవటం లేదని వాపోయారు. తమను ఎందుకు పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యేను నిలదీశారు. ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని ఈ పదవి ఎందుకంటూ ఎమ్మెల్యే ఎదుట నిరసనకు దిగారు. అనంతరం మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు.
ఇవీ చూడండి