ETV Bharat / state

TTD Board New Members Appointed: టీటీడీ బోర్డు సభ్యుల నియామకం.. కృష్ణమూర్తికి నాలుగో సారి మళ్లీ ఛాన్స్‌

TTD Board New Members Appointed: ఇటీవల టీటీడీ బోర్టు సభ్యుల నియామకాలపై ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు జగన్ ఎదుర్కొంటున్నాడు. బోర్డు సభ్యులిగా నాలుగోసారి ​కృష్ణమూర్తికి అలానే దిల్లీ లిక్కర్​ కేసులో నిందితుడిగా ఉన్న శరత్​ చంద్రారెడ్డికి పదవులు ఇవ్వడాన్ని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనిపై తాజాగా అచ్చేన్నాయుడు తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

appointments_of_ttd_board_members
appointments_of_ttd_board_members
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 11:46 AM IST

Appointments of TTD Board Members: టీటీడీ బోర్డులో కృష్ణమూర్తి వైద్యనాథన్‌ నాలుగోసారి సభ్యత్వం సంపాదించారు. ఇదెలా సాధ్యమైందనే ప్రశ్న అందరి నుంచి వస్తోంది. టీటీడీ బోర్డు సభ్యత్వానికి అధిక డిమాండు ఉంది. జీవితకాలంలో సంపాదించలేని తలపండిన నాయకులూ ఉన్నారు. తమకుండే ప్రొటోకాల్‌ను ఉపయోగించుకొని కార్పొరేట్‌ వ్యాపారస్థులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా పరిచయాలు పెంచుకునే సమయంలో తమ వ్యాపారాన్ని పెంచుకుంటారు. అందువల్లనే టీటీడీ బోర్డులో పదవికి అంత డిమాండు. ఆ పదవికి ఇంతటి డిమాండ్‌ ఉన్నా కృష్ణమూర్తి వైద్యనాథన్‌కి మాత్రం ఆ అవకాశం వస్తూనే ఉంది.

BJP Purandeswari on TTD Chairman Post: 'హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారినే టీటీడీ ఛైర్మన్​గా నియమించాలి'

Krishnamurthy Selected as TTD Board Member: చెన్నైకి చెందిన ఈ ఆడిటర్‌ 2015 తొలిసారి తెలుగుదేశం ప్రభుత్వంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2018లో స్థానం దక్కకపోగా మరలా వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తిని నియమించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కృష్ణమూర్తికి వైసీపీ ప్రభుత్వం వరుసగా అవకాశం ఇస్తూ వస్తోంది. 2021 బోర్డులో అవకాశం రాకపోగా.. కొద్దిరోజుల వ్యవధిలోనే బోర్డులోని వేమిరెడ్డి ప్రశాంతిని దిల్లీ ఎల్‌ఏసీ ఛైర్‌పర్సన్‌గా నియమించి కృష్ణమూర్తిని ఆమె స్థానంలో సభ్యుడిగా నియమించారు. ఇలా 2015 నుంచి ఇప్పటి వరకూ 8 ఏళ్లలో ఆరేళ్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. ఇప్పుడు కేంద్రంలోని మహిళామంత్రి సిఫార్సుతో వచ్చారనే ప్రచారం ఉంది.

TDP Leader Vangalapudi Anitha Comments on TTD Board Member: "రాజకీయ నిరుద్యోగులకు టీటీడీ బోర్డు నిలయంగా మారింది"

Achennaidu Comments on TTD Board Members Appointments: దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న శరత్‌చంద్రారెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించడం హిందూధర్మాన్ని మంటగలపడమేనని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తాజాగా నియమించిన బోర్డు సభ్యుల్లో చాలా మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని.. అసలు ఓ క్రైస్తవుడ్ని టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమించడం తిరుమల పవిత్రను మంటగలపడమేనని మండిపడ్డారు. ఓ దుర్మారుడు, సైకో పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా అందరూ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా మూడు కోట్ల మందికి చేరువవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Liquor Scam Accused Sarath Chandra Reddy in TTD Board టీటీడీ బోర్డు మెంబర్​గా దిల్లీ లిక్కర్‌ కేసు అప్రూవర్​ శరత్‌ చంద్రారెడ్డి

Babu Surety - Bhavisyathuku Guarantee Program: బూత్‌ స్థాయి నుంచి నియోజకవర స్థాయి వరకు 45 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.. రాష్ట్రంలో జే గ్యాంగ్‌ ఇసుక దోపిడీని ఎండగట్టడానికి సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఇసుక సత్యాగ్రహాలు చేపడతామని తెలిపారు. ఈ నెల 31తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుతుంది.. దీనికి సంఘీభావంగా 175 నియోజకవర్గాల్లో 3 కి.మీ మేర సంఘీభావ పాదయాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వీటిలో జగన్‌ పాలనలో దగాపడ్డ బాధితుల్ని, అక్రమ కేసులతో అన్యాయంగా జైలు పాలైన వారిని భాగస్వాముల్ని చేయాలని తెలియజేశారు. సంక్షేమం పేరుతో ప్రజల్ని దగా చేస్తూ.. పన్నులు, ధరలు, ఛార్జీల బాదుడుతో మోయలేని భారం వేస్తున్న ఈ ప్రభుత్వ అరాచకాల్ని వివరించాలని కార్యకర్తలకు అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.