ETV Bharat / state

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ఠమైన భద్రత

Tirumala Annual Brahmotsavalu: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులకోసం రక్షణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పార్కింగ్​ కోసం ప్రత్యేకమైన పార్కింగ్​ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

tirumala
tirumala
author img

By

Published : Sep 26, 2022, 8:05 PM IST

Tirumala Brahmotsavalu: మంగళవారం నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్​ రెడ్డి తెలిపారు. భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే 100 డయల్​ చేయలని.. 14 పోలీస్​ సబ్​ కంట్రోల్​ రూమ్​లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నాలుగు వేల మందితో భద్రత కల్పిస్తున్నామని, గరుడ సేవ రోజు మరో రెండు వేల మందితో భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. వృద్ధులు, చిన్నపిల్లలకు జియో ట్యాగింగ్​లు ఏర్పాటు చేసి రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.

భద్రత చర్యల కోసం ముగ్గురు అదనపు ఎస్పీలు, 28 డీఎస్పీలు, సీఐలు 111, ఎస్​ఐలు 273, ఏఎస్​ఐలు, హెచ్​సీలు 979, మహిళా పోలీసులు 141, పీసీలు 2,076, స్పెషల్​ పార్టీలు 121, ఏఆర్​, ఏపీఎస్​పీ, ఆక్టోపస్​ ఇంటెలిజెన్స్​ 1,100 సిబ్బంది బ్రహ్మోత్సవ సేవల కోసం పాల్గొననున్నారని ఎస్పీ తెలిపారు.

వాహనాల పార్కింగ్​ కోసం: గరుడ సేవకు తరలివచ్చే భక్తుల పార్కింగ్​ కోసం.. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12నుంచి ఆక్టోబర్​ 2వ తేదీ ఉదయం వరకు ట్రాఫిక్​ మళ్లీస్తున్నామని ఎస్పీ పరమేశ్వర్​ రెడ్డి తెలిపారు. టూరిస్టు బస్సులు, టెంపో ట్రావెలర్​, మెటాడోర్​ వాహనాలు జూపార్కు రోడ్డులోని దేవలోక్​ పార్కింగ్​ వద్ద వాహనాలు పార్కింగ్​ చేసుకోవచ్చు. కార్లు జీపులు వంటి చిన్న వాహనాలు భారతీయ విద్యా భవన్​ స్కూల్​ గ్రౌండ్​లో పార్క్ చేసుకోవాలని సూచించారు. గరుడ కూడలి వద్ద పాత చెక్​ పాయింట్​, ఇస్కాన్​ ఆలయం వద్ద పార్కింగ్​ ప్రదేశం, మెడికల్​ కళాశాల మైదానం, నెహ్రు మున్సిపల్​ పార్కులో పార్కింగ్​ చేసుకోవచ్చని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.