Student Died in Sand pit at Chandragiri: తిరుపతి జిల్లాలో ఇసుక కోసం తీసిన గుంత ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తోటి విద్యార్థులతో కలిసి ఆదివారం సెలవు రోజు కావటంతో సరదగా ఈత కోసమని వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కేకలు వేయగా అక్కడికి వచ్చిన స్థానికులు గాలించిన ఫలితం లేకుండా పోయింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన కార్తీక్ అనే విద్యార్థి.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరికి సమీపాన ఉన్న ప్రైవేట్ కళశాలలో బ్యాచిలర్ అఫ్ పిజియోథెరపీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావటంతో తోటి స్నేహితులతో కలిసి తోటి స్నేహితులతో కలిసి.. రెడ్డివారిపల్లె సమీపాన స్వర్ణముఖి నదిలో ఈత కొట్టటానికి వెళ్లాడు. స్నేహితులంతా కలిసి నదిలో ఈతకు దిగారు.
అందరు కలిసి ఈతకు దిగగా.. కార్తీక్ ఇసుక కోసం తీసిన గుంతలో మునిగిపోయాడు. కార్తీక్ మునిగిపోవటాన్ని చూసిన తోటి మిత్రులు పెద్దగా కేకలు వేశారు. గమనించిన స్థానికులు అక్కడకు వచ్చి గుంతలో దిగి గాలించి కార్తీక్‌ను బయటకు తీశారు. అప్పటికే కార్తీక్ ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కార్తీక్ మృతదేహన్ని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
ఘటనాస్థలాన్ని సందర్శించిన టీడీపీ నేతలు: ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న చంద్రగిరి టీడీపీ పార్టీ ఇంచార్జ్ పులివర్తి నాని ఘటనాస్థలానికి చేరుకున్నారు. విద్యార్థి మృతి పట్ట దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇసుక రీచ్‌లకు గడువు ముగిసినా పోలీసులు దగ్గరుండి నదిలో 20 నుంచి 30 అడుగుల మేర ఇసుక తరలించటం వల్లే భారీ గుంతలు ఏర్పడ్డాయని పులివర్తి నాని అన్నారు. ఈత కోసమని నదిలోకి దిగిన విద్యార్థిని ఆ గుంతలు బలి తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వర్ణముఖిలో ఇసుక దందా నడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవటంపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఇసుక అక్రమ రవాణాలు అరికట్టాలని ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేదని వాపోయారు. చివరకు పోరాటం చేసిన గ్రామస్థులు, టీడీపీ నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి ఇద్దర్ని జైలుకు పంపించారన్నారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని లేకుంటే ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
Jeevan Murder Case: జీవన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి ఉండొచ్చు.. పోలీసుల అనుమానం