ETV Bharat / state

Rangampeta MPTC Comments: 'మాకు ప్రాణహాని ఉంది.. ఏం జరిగినా వారే కారణం' - manchu mohan babu

Allegations on Sri Vidyanikethan: శ్రీ విద్యానికేతన్‌కు చెందిన పీఆర్ఓ సతీష్, అతని అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని చంద్రగిరి మండలం, రంగంపేట ఎంపీటీసీ సభ్యులు బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డి ఆరోపించారు. తమను హత్య చేసేందుకు ఆరుగురు దుండగులను పంపించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఒకరిని పట్టుకుని.. అతని నుంచి కర్రలు, కత్తి, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు.

MPTC Bose Chandra Reddy
ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి
author img

By

Published : Jun 18, 2023, 2:15 PM IST

Rangampeta MPTC Allegations on Sri Vidyanikethan: శ్రీ విద్యానికేతన్‌కు చెందిన పీఆర్ఓ సతీష్, సునీల్ చక్రవర్తి పంపిన కొందరు వ్యక్తులు తమ హత్యకు కుట్ర చేశారని చంద్రగిరి మండలం, రంగంపేట ఎంపీటీసీ సభ్యులు బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి బాలాజీ కాలనీలో నివాసం ఉంటున్న ఎంపీటీసీ సభ్యుడు‌ బోస్ చంద్రారెడ్డిని హత మార్చేందుకు ఆరుగురు దుండగులు విఫలయత్నం చేశారని బాధితులు ఆరోపణ చేశారు. వారిలో హేమంత్ అనే యువకుడిని పట్టుకొని బోస్ చంద్రారెడ్డి అనుచరులు చంద్రగిరి పోలీసులకు అప్పగించారు.

తొలుత ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డిపై, అతని ఇంటిపై ఆరుగురు దుండగులు రెక్కీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమై వారిలో ఒకరిని పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన హేమంత్​గా గుర్తించారు. అతనిని అడగగా.. రంగంపేట ఎంపీటీసీ సభ్యులు బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డిని చంపడానికి వచ్చామని చెప్పినట్లు బాధితులు అన్నారు.

MPTC Bose Chandra Reddy: 'మాకు ప్రాణహాని ఉంది.. ఏం జరిగినా మోహన్ బాబే కారణం'

చంద్రగిరిలోని శ్రీ విద్యానికేతన్‌ యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్, మంచు అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.. నిందితులకు ఫోటోలు పంపించి రూ.3 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపారని బోస్ చంద్రారెడ్డి ఆరోపించారు. రంగంపేట పంచాయతీ పరిసర ప్రాంతాల్లోని సుమారు ఎనిమిది కోట్ల విలువ గల డీకేటీ భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

అదేవిధంగా దుండగుడి సెల్​ఫోన్​లో.. మరిన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు. అతని ఫోన్​లో ఉన్న ఫోటోలను చూపించారు. తర్వాత చంద్రగిరి పోలీసులు రంగంపేట చేరుకుని నిందితుడు హేమంత్​ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కర్రలు, కత్తి, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు.

"ఎనిమిది కోట్ల విలువైన భూమిపై కన్నేశారు. వాళ్లకు ఆ భూములు ధారాదత్తం చేయలేదు అని మా మీద దాడి చేయాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు మా ఇంటికి వచ్చారు. అందులో హేమంత్ అనే వ్యక్తి నాపై దాడి చేయాలని.. కత్తి తీశాడు. తర్వాత బయటకు వెళ్లి పెట్రోల్ తీసుకొని వచ్చి.. నా కారును కాల్చడానికి ప్రయత్నించారు. నా కారును కాల్చమని సునీల్ చక్రవర్తి చెప్పాడు అని వాళ్లు అన్నారు. విద్యానికేతన్ సంస్థల్లో పనిచేసే పీఆర్వో సతీష్.. నా ఫోటోలు, మోనీష్ పోటోలు పంపించాడు. వారికి ఫోన్ పేలో డబ్బులు కూడా పంపించారు.

నన్ను చంపేయమని పెద్దాయన చెప్పారని అన్నారు. అస్సలు మమ్మల్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నారు. మేము ఏం తప్పు చేశాం. మాకు ఏం జరిగినా మోహన్ బాబు, సునీల్ చక్రవర్తి, సతీష్ కారణం. వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది. మమ్మల్ని చంపేస్తారు". - బోస్ చంద్రారెడ్డి, ఏ.రంగంపేట ఎంపీటీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.