ETV Bharat / state

తితిదేలో అక్రమాలకు పాల్పడుతున్న సూపరింటెండెంట్‌ సహా ఆరుగురు అరెస్ట్​ - illegal activities in TTD

తితిదేలో అక్రమాలకు పాల్పడుతున్న ఆరుగురు దళారులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో తితిదేకు చెందిన ఉన్నతాధికారి ఉండటం విశేషం. తితిదే విజిలెన్స్​ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1
1
author img

By

Published : Aug 12, 2022, 10:49 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం సూపరింటెండెంట్‌ సహా ఆరుగురు దళారులను తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో దర్శన టికెట్లు ఇప్పించడంలో అక్రమాలు గుర్తించిన తితిదే విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖలోని తితిదే హెచ్‌డీపీపీ విభాగంలో పనిచేస్తున్న మల్లికార్జునను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు దళారులు వెంకట మురళీకృష్ణ, వంశీకృష్ణ, గణేశ్ వెంకట సుబ్బారావు తో పాటు కంఠసాని విజయకుమారి, కంఠసాని నవ్యశ్రీని అదుపులోకి తీసుకున్నారు.

తితిదేలో పని చేస్తున్న మల్లికార్జున సిఫారసు లేఖలతో 6 నెలల్లో 700మందికి దర్శనాలు చేయించారని విచారణలో వెల్లడైంది. 350 మందికి బ్రేక్‌ దర్శనాలు, 350 మందికి 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు, 12 కల్యాణోత్సవ టికెట్లు ఇప్పించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.