Road Accidents in Andhra Pradesh: రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు మృతి చెందగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతిలో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి: తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. నారాయణవనం మండలంలోని సముదాయం పరిధిలో చెన్నై నుంచి పుత్తూరు వైపు వస్తున్న కారు.. పుత్తూరు నుచి పిచ్చాటూరు వెళ్తోన్న కళాశాల బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
అతివేగంగా వచ్చి లారీని ఢీకొన్న ఆటో, ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు- ఇద్దరి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో మరణించిన వారు పుత్తూరు మండలం పరమేశ్వర గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతులు రమేశ్ నాయుడు, వనజాక్షమ్మ, పుష్పమ్మ, బానుగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మహిళ శివమ్మ అని తెలిపారు. బస్సులోని ముగ్గురు విద్యార్థులకు స్వల్పగాయాలు కాగా.. వారిని పుత్తూరులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Road Accident in Nellore ముగ్గుర్ని మింగిన రోడ్డు ప్రమాదం : నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని కావలి మండలం మద్దూరుపాడు వద్ద ఓ కారు వేగంగా వచ్చి రోడ్డు మార్జిన్లో ఉన్న మహిళను వేగంగా ఢీ కొట్టి.. అంతటితో ఆగకుండా ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. స్థానికుల సహాయంతో ప్రమాదంలో గాయపడిన ఇద్దర్ని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు విజయవాడ భవానీపురం వాసులని సమాచారం. తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదానికి కారణమైన శునకం- మృతుడి ఇంటికి వెళ్లి ఓదార్పు!