ETV Bharat / state

బ్యాంక్​ లోన్​ ఇప్పిస్తానని తీసుకెళ్లి.. నెల రోజులుగా వివాహితపై అత్యాచారం

author img

By

Published : Jan 11, 2023, 4:48 PM IST

Rape On Woman: ఓ వ్యక్తి... వివాహితను నెల రోజుల పాటు రెండు చోట్ల నిర్బంధించి అత్యాచారం చేశాడని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో బాధిత మహిళతో పాటు మంగళవారం విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

rape on woman
rape on woman

Rape On Woman: ఓ వ్యక్తి... వివాహితను నెల రోజుల పాటు రెండు చోట్ల నిర్బంధించి అత్యాచారం చేశాడని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో బాధిత మహిళతో పాటు మంగళవారం విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి అంబేడ్కర్‌ భవనం ఛైర్మన్‌ దుగ్గాని జయరాం, దళిత ఐక్యవేదిక నాయకులు కత్తి హరి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన ఓ వివాహిత తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు.

బలిజపల్లికి చెందిన వ్యక్తి గత ఏడాది నవంబరు 17న వివాహిత పని చేస్తున్న పాఠశాలకు వెళ్లాడు. తనతోవస్తే బ్యాంక్‌లోన్‌ ఇప్పిస్తానని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించి ప్రతిఘటించడంతో పాఠశాల ఆవరణలో బెదిరించి, కొట్టి బలవంతంగా ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించి 5రోజుల పాటు అత్యాచారం చేశాడు. పాకాల మండలం దామలచెరువులోనూ కొన్నిరోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను స్వగ్రామంలో విడిచిపెట్టాడు. బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. గ్రామ పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో ఈ ఏడాది జనవరి 6న తిరుపతి జిల్లా ఎస్పీ, దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ రామరాజుకు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదని దళిత సంఘాల నాయకులు వాపోయారు.

ఇవీ చదవండి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.