ETV Bharat / state

మూత్రం పోసి, గుండు కొట్టిన ఘటనలో నిందితులకు ఓ కానిస్టేబుల్ సహకారం..? - inhuman incident

Police Arrested Accused in Inhuman Incident in Tirupati District: తిరుపతి జిల్లా చంద్రగిరిలో వంశీ అనే వ్యక్తికి శిరోముండనం చేయించిన హర్షా రెడ్డి అన్వర్​లు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. బాధితుడు వంశీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్.. వీళ్లకి సహకారం అందించాడనే సమాచారంతో.. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Inhuman Incident
అమానుష ఘటన
author img

By

Published : Mar 5, 2023, 5:38 PM IST

Police Arrested Accused in Inhuman Incident in Tirupati District: తిరుపతి జిల్లా చంద్రగిరిలో వంశీకి శిరోముండనం చేయించిన హర్షా రెడ్డి, అన్వర్​లు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. రాత్రి బాధితుడు వంశీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనటో అన్వర్, హర్షా రెడ్డిలకు.. మొదట నుంచీ ఓ కానిస్టేబుల్ సహకారం అదించాడని సమాచారం. హర్షా రెడ్డి, అన్వర్​లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరికి సహకరించిన కానిస్టేబుల్ వివరాలు కూడా తెలుసుకునే పనిలో పడ్డారు.

అసలు ఏం జరిగిందంటే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం ఏరంగంపేటకు చెందిన హరికృష్ణ నాయుడి కుమారుడు వంశీ. వంశీ చంద్రగిరిలో ఆటోను అద్దెకు తీసుకొని.. నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళతో.. మూడేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. వివాహానికి దారి తీసింది. దీంతో ఆటో యజమాని అయిన అన్వర్.. వంశీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఆ సమయంలో అన్వర్.. వంశీ భార్యతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు.

పుట్టింటికి వెళ్తున్నానని అన్వర్ వద్దకు: దీంతో వంశీ భార్య రెండు నెలల క్రితం.. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి.. అన్వర్ వద్దకు వెళ్లింది. ఇదే సమయంలో వంశీ ఆటోను వదిలి బెంగళూరులో కూలి పని చేసుకోవడానికి వెళ్లాడు. తన భార్య అన్వర్ వద్దకు వెళ్లిందనే విషయం తెలుసుకున్నాడు వంశీ. ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉందని విచారణ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాడు. దీంతో వంశీ తీవ్ర కోపంతో .. ఫేస్‌బుక్‌లో తన భార్య, ఆమె ప్రియుడు అయిన అన్వర్‌ చనిపోయినట్లు 'రిప్' అని ఓ పోస్ట్ షేర్ చేశాడు.

సోషల్ మీడియాలో పోస్ట్: వంశీ పెట్టిన పోస్టుకు ఆగ్రహించిన అన్వర్.. తన స్నేహితుడైన హర్షా రెడ్డితో కలిసి ప్లాన్ చేశాడు. వంశీతో మాట్లాడాలని చెప్పి బెంగళూరు నుంచి చంద్రగిరి పిలిపించాడు. తరువాత చంద్రగిరి పరిసర ప్రాంతమైన రాయలపురంలోని నిర్మానుష్య ప్రాంతంలో చితకబాది, చిత్రహింసలు పెట్టారు. మూత్రం పోసి గుండు గీయించారు. షయం బయటకు చెపితే చంపేస్తామని బెదిరించి వంశీ దగ్గరే క్షమాపణ చెప్పిస్తూ మరో వీడియో తీయించారు. తప్పుగా పోస్టులు పెట్టానని అందుకు ప్రాయశ్చిత్తంగా తానంతట తానే గుండు కొట్టించుకున్నట్లు వంశీతో బలవంతంగా చెప్పించారు.

వీడియో వైరల్: వంశీని చిత్రహింసలు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పోలీసులు కేసును సీరియస్​గా తీసుకున్నారు. మొదట ప్రాణభయంతో ఫిర్యాదు చేయడానికి వెనుకాడిన వంశీ.. తరువాత స్థానికులు ధైర్యం చెప్పడంతో.. హర్షా రెడ్డి, అన్వర్​లపై ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ సహకారం ఉందనే కోణంలోనూ విచారణ చేస్తున్నారిని సమాచారం.

వంశీని చిత్రహింసలు పెట్టి.. తలపై మూత్రం పోసి గుండు కొట్టించారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. దీనిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితుడు వంశీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్​, హర్షారెడ్డిని అరెస్ట్​ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.